Cobra Movie: మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి: కోబ్రా దర్శకుడు

హిట్ అయినా… ప్లాప్ అయినా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికే హీరో చియాన్‌ విక్రమ్‌ ఇష్టపడతాడు.ఇదే క్రమంలో ఆయన ‘కోబ్రా’ అనే మరో విలక్షణమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆగస్టు 31న వినాయక చవితి రోజు నాడు రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి కానీ మౌత్ టాక్ చాలా బ్యాడ్ గా ఉంది. క్లైమాక్స్‌ బాలేదని, రన్ టైం ఎక్కువైంది అంటూ రక రకాల నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

‘డిమోటి కాలని’ ‘అంజలి సీబీఐ’ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కాబట్టి.. ‘కోబ్రా’ పై అంచనాలు పెరిగాయి. కానీ ‘కోబ్రా’ ఆ సినిమాల స్థాయిలో లేకపోవడం వల్ల.. ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు అని స్పష్టమవుతుంది. ఈ విషయం పై దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు కూడా స్పందించి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల సోషల్ మీడియాలో ”కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్‌ డిజప్పాయింటింగ్ గా ఉంది” అంటూ ఓ నెటిజన్‌ ‘కోబ్రా’ పై కామెంట్ చేశాడు.

అందుకు అజయ్ .. ”పోలీసుల నుంచి హీరో తప్పించుకొని విదేశాల్లో స్వేచ్ఛగా బ్రతుకుతున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా?” అంటూ బదులిచ్చాడు.మరో నెటిజెన్ ”స్క్రీన్‌ప్లే చాలా గందరగోళంగా ఉంది” అంటూ కామెంట్ చేశాడు. అందుకు అజయ్… ”మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతీ క్షణం ఉత్కంఠకు గురి చేసే సినిమాలు చూడటాన్ని ఒక ప్రేక్షకుడిగా నేనిష్టపడతాను. అందుకే ‘కోబ్రా’ ని అలా తీర్చిదిద్దాను. వీలుంటే మరోసారి ‘కోబ్రా’ ని చూడండి.మీకు తప్పకుండా నచ్చొచ్చు ” అంటూ బదులిచ్చాడు.

మరో నెటిజెన్ ‘కోబ్రా’ రన్ టైం ఎందుకు ఎక్కువగా చేసారు?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు అజయ్ ”సినిమాలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాలనుకున్నాం. అందుకే మొదటి రోజు 3 గంటల నిడివితో చిత్రాన్ని విడుదల చేశాం. పలువురు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వల్ల నిడివి తగ్గించాం. రన్ టైం విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలని అర్థమైంది” అంటూ వివరణ ఇచ్చాడు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus