పాట బీట్ నచ్చితే… భావం అర్థం కాకపోయినా వినేస్తుంటారు. అలా మన దేశంలో హిట్ అయిన పాటలు చాలానే ఉన్నాయి. ‘డెస్పాసీటో..’, ‘గంగ్నమ్ స్టైల్…’ లాంటివి విదేశాల్లో రూపొందినా మన దగ్గర మంచి విజయమే అందుకున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు ఆ పాటల్ని సోషల్ మీడియాల్లో విన్నారు మనవాళ్లు. ఇప్పుడు అలాంటి పాటల లిస్ట్‌లోకి వెళ్లిన పాట ‘మాణికే మగే హితే…’ ముందుగా చెప్పినట్లు ఇది మన దేశానికి చెందిన పాట కాదు. పక్క దేశం శ్రీలంకలో రూపొందింది.
యూట్యూబ్‌లో సెర్చ్ రిజల్ట్స్‌లోనూ, రికమెండేషన్స్‌లోను, ట్రెండింగ్‌లోను ఈ పాట మీకు కనిపించే ఉంటుంది. తొలుత పెద్దగా ఈ పాటను చూడకపోయినా… సెలబ్రిటీలు ఈ పాటను మెచ్చుకుంటూ ట్వీట్లు వేయడంతో చాలామంది చూడటం ప్రారంభించారు. అలా ఈ పాటను ఇప్పుడు 120 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ఆ పాట పాడిన సింగర్ యొహానిది శ్రీలకంలోని కొలంబో అనే విషయం తెలిసిందే. ఇప్పుడామె పాట లైవ్‌లో వినే అవకాశం వచ్చింది. అది కూడా హైదరాబాద్ వాసులకు.
అక్టోబర్ 3న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘హార్ట్ కప్ కాఫీ’లో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నారు. దానికి యొహాని వస్తోందట. అక్కడ ‘మాణికే మాగే హితే’తో పాటు మరిన్ని పాటలు ఆలపించేందుకు యొహాని సిద్ధంగా ఉందట. ఇక ఆసక్తి ఉన్నవాళ్లు ఆ రోజు అక్కడ వాలిపోవడమే, ఆ పాటల్లో మునిగితేలిపోవడమే.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?