Colour Photo Movie: బ్రహ్మ పాత్రలో నటుడు సునీల్!

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు సునీల్. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు.. ‘డిస్కో రాజా’, ‘కలర్ ఫోటో’ వంటి సినిమాల్లో విలన్ గా కనిపించి షాకిచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా పౌరాణిక వేషాలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ‘కలర్ ఫోటో’ సినిమా కోసం పని చేసిన కొందరు నటులు, టెక్నీషియన్లు కలిసి ఓ వెబ్ సిరీస్ ను తయారు చేశారు.

ఇందులో కామెడీ, ఎమోషన్స్, డ్రామా అన్నీ ఉంటాయి. ఫాంటసీ ఎలిమెంట్స్ ను కూడా జోడించారట. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సిరీస్ లో టాలీవుడ్ స్టార్స్ కొందరు క్యామియో రోల్ పోషించినట్లు తెలుస్తోంది. కానీ ఆ స్టార్స్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ సిరీస్ కోసమే సునీల్ బ్రహ్మ అవతారం ఎత్తినట్లు సమాచారం. గతంలో కమెడియన్ కమ్ హీరో రాజేంద్రప్రసాద్ బ్రహ్మగా ఓ సినిమా చేశారు. ఇప్పుడు సునీల్ వంతు వచ్చింది.

వీలైనంత త్వరగా ఈ సిరీస్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సునీల్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. అలానే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం సునీల్ కి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus