“పవన్-మహేష్” కలగలసిన పాత్ర – నితిన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. అందులోనూ…. యువ హీరో నితిన్, అందాల భామ సమంత కూడా తోడైతే….ఇక ఆ సినిమా సూపర్ హిట్ కాకపోతే ఇంకేం అవుతుంది. విషయం ఏమిటంటే…అ..ఆ.. చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా…లైన్ తప్పకుండా చాలా నీట్ గా, కుటుంభం మొత్తం కలసి చూడాల్సిన సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో నితిన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…అవేమిటంటే…ఈ కేరక్టర్ గురించి త్రివిక్రమ్ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానంటున్నాడు నితిన్. ‘నేను ఇంతకు ముందు చేసిన కేరక్టర్లన్నీ సరదాగా ఉండేవే. కానీ ఈ పాత్ర గురించి చెప్పినపుడు.. అతడు సినిమాలో మహేష్ పడే బాధ ఈ రోల్ ఉంటుంది. అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ అంత యాక్టివ్ గాను బాధ్యతగా ఉండాలి అని త్రివిక్రమ్ చెప్పారు. దీన్ని అందుకునేందుకు స్పెషల్ గా నేను వర్క్ షాప్ కి అటెండ్ కావాల్సి వచ్చింది.’

అని చెప్పాడు నితిన్. అంతేకాకుండా…ఈ సినిమా తాను యాక్టింగ్ విషయంలో చాలా మార్పులు సైతం వచ్చాయి అని…తను నటించేటప్పుడు సాధారణంగా కనుపాపలు వేగంగా కదులుతాయి అని, ఈ సినిమాలో అలాంటివి లేకుండా నటించాల్సి రావడం ఇబ్బంది కలిగించిందట. ఇతర పాత్రలవైపు కదలకుండా చూడాలనడం కష్టమైనా.. చివరకు చేశానని చెప్పాడు. అంత కష్టపడ్డందుకు.. ఇప్పుడు తగిన రిజల్ట్ అందుకున్నాను అని నితిన్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఏది ఏమైనా…నితిన్ కు మంచి హిట్ అందించాడు మన త్రివిక్రమ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus