గత ఎన్నికల ఫలితాలను బట్టి చూసుకుంటే.. తెలుగుదేశం పార్టీకి జునియర్ ఎంట్రీ.. అవసరం ఉందని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎక్కడో ‘నందమూరి మరియు నారా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ విషయంలో సముఖత చూపించడం లేదు’ అనే టాక్ కూడా ఉండనే ఉంది. తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరి.. తెలుగుదేశం పార్టీ ని ముందుండి నడిపించడానికి ఎన్టీఆర్ అవసరం చాలా ఉందనేది నందమూరి మరియు టిడిపి అభిమానుల అభిప్రాయం కూడా..!
ఈ క్రమంలో ఎన్టీఆర్,బాల కృష్ణ లు ఈ విషయం పై ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ‘నాకు అంత అనుభవం లేదు’ అని ఎన్టీఆర్, ‘రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా ఎన్టీఆర్ ఇష్టం’ అంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల కమెడియన్ పృథ్వీ కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్స్ చేసాడు. అతను మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఉన్న రాజకీయాలను బట్టి చూస్తే… ఎన్టీఆర్ అవసరం ఎంత మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏం చేయగలడు.?
అతని సినిమా కెరీర్ ఇప్పుడు చాలా బాగుంది. సినిమాలు చేసుకుంటేనే అతనికి మంచిది. భవిష్యత్తులో ఎన్టీఆర్ కు 55 ఏళ్ల వయసు వచ్చాక ఏదైనా కొత్త ఎజెండాతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇక్కడ కూడా అతని భవిష్యత్తు బాగుంటుందేమో తప్ప.. ఇప్పుడైతే ఎన్టీఆర్ పాలిటిక్స్ కు అనవసరం” అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీ.
Most Recommended Video
40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?