‘జబర్దస్త్’ కమెడియన్ రఘుకి ఇంత కాస్ట్లీ ఇల్లు ఎలా అబ్బా..?

‘ఆది’ ‘దిల్’ ‘లక్ష్మీ’ ‘కిక్’ ‘యోగి’ ‘అదుర్స్’ ‘పిల్ల జమిందార్’ ‘ఊసరవెల్లి’ ‘టెంపర్’ ‘దేవదాస్’ వంటి చిత్రాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ కమెడియన్ గా ఎదగలేకపోయాడు రఘు కారుమంచి. అయితే ‘జబర్దస్త్’ కామెడీ షో వల్ల బాగా పాపులర్ అయ్యాడు. ‘రోలర్ రఘు’ గా ఇతను బాగా ఫేమస్. అయితే ఇతను పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి లో… పెరిగింది అంతా హైదరాబాద్లోనే..! రఘు తండ్రి వెంకట్రావు గారు ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు.

తల్లి గృహిణి. రఘు ఓ ఎం.బి.ఎ స్టూడెంట్. కొన్నాళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. రఘుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వాళ్ళ పేర్లు ఝాన్సీ స్వప్నిక, తేజస్వి ఇతని భార్య పేరు వాణి. రఘు తండ్రి గత ఏడాది ఆగస్టు 4న మరణించడం జరిగింది. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ టైంలో రఘు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.అలాంటిది ఇప్పుడు అతను ఓ లగ్జరీ ఇంటికి ఓనర్ అయ్యాడు.

ఇంత తక్కువ టైంలో అతను ఇంత డబ్బు ఎలా సంపాదించినట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఓ లిక్కర్ షాప్ లో ఇతను లిక్కర్ అమ్ముతూ కనిపించిన వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అవకాశాలు లేక రఘు ఇలా అయిపోయినట్టు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.

అయితే లిక్కర్ బిజినెస్ బాగా క్లిక్ అవ్వడంతో తక్కువ టైంలోనే మళ్ళీ డబ్బు సంపాదించాడని తెలుస్తుంది. రఘు ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే. ఓ ఇంద్రభవనంలా ఉంది. అతని ఇంటి ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus