Comedian Raghu: సినిమాల నుండి ఇటువైపు ఎందుకొచ్చాడబ్బా!

రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో కమెడియన్‌ రఘు గురించి ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. మీరూ చూసే ఉంటారు. లేదంటే ఈ వార్త ఆ వీడియో గురించే. సినిమాల్లో తనదైనశైలిలో పెక్యూలియర్‌ వాయిస్‌, మాడ్యులేషన్‌, బాడీ లాంగ్వేజ్‌తో అలరించిన నటుడు రఘు. టీవీల్లో కూడా రోలర్‌ రఘుగా సుపరిచితుడు. అతను ఓ వైన్‌ షాప్‌ క్యాష్‌ కౌంటర్‌లో ఉన్నాడు అనేది ఆ వీడియో సారాంశం. దీంతో ఏంటీ… రఘు ఇక్కడెందుకు ఉన్నాడు అనుకుంటున్నారంతా.

సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్ల సంగతి తొలుత చూద్దాం. వీడియో కింద కామెంట్స్‌ చూస్తే… ‘ఏంటీ రఘు వైన్‌ షాప్‌లో పని చేస్తున్నాడా? సినిమా అవకాశాలు ఫర్వాలేదు బాగానే వస్తున్నాయిగా’ అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే అక్కడే కొంతమంది ఆ కామెంట్లకు సమాధానం ఇచ్చేశారు. ఎందుకంటే రఘ సినిమాల్లోకి వచ్చే ముందు మంచి ఉద్యోగమే చేసేవాడు. ఆర్థికంగా కాస్త ఉన్న ఫ్యామిలీనే. ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. ఇటీవల తెలంగాణలో జరిగిన మద్యం దుకాణాల వేలంలో రఘుకు రెండు దుకాణాలు వచ్చాయట.

నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్‌ పక్కనున్న అభినవ్ 1 & 2 దుకాణాలను రఘు వేలంలో దక్కించుకున్నాడట. అలా లైసెన్స్‌లు వచ్చిన వాళ్లు బుధవారం నుండి అమ్మకాలు ప్రారంభించారు. అలా రఘు కూడా తనకు వచ్చిన మద్యం దుకాణాల ముందు పూజలు నిర్వహించి.. కాసేపు కౌంటర్లు నిలబడి మద్యం అమ్మాడు. అప్పుడు రికార్డు చేసిందే ఈ వీడియో.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus