Sudhakar: గుర్తుపట్టలేని స్థితిలో కమెడియన్ సుధాకర్.. వీడియో వైరల్!

ఒకానొక సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు సుధాకర్ కొన్ని కారణాలవల్ల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా వెలివేయబడ్డారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన కమెడియన్ గా స్థిరపడ్డారు. ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కమెడియన్ సుధాకర్ వయసు పై పడటంతో ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయనకు కాస్త అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అందరూ కూడా అనారోగ్య సమస్యలతో ఈయన మరణించారని భావించారు. అయితే ఎన్నోసార్లు సుధాకర్ తాను బ్రతికే ఉన్నానని క్షేమంగా ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.ఈ విధంగా వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ చాలా రోజుల తర్వాత బుల్లితెర వేదికపై సందడి చేశారు. జూన్ 18వ తేదీ ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగులో ప్రసారమవుతున్న నేను నాన్న అనే కార్యక్రమంలో సుధాకర్ పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇందులో (Sudhakar) సుధాకర్ కు వేదికపై సన్మానం చేయడమే కాకుండా తన చేత తన కుమారుడు కేక్ కట్ చేయించి తనకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సుధాకర్ కు మాత్రం మాట కూడా బయటికి స్పష్టంగా పలకలేని స్థితిలో ఉన్నారు. ఈ విధంగా తన కొడుకు కేక్ తినిపించి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పడంతో ఆయన అతి కష్టంగా మాట్లాడుతూ అబ్బబ్బబ్బా అంటూ తన డైలాగ్ తో నవ్వించేశారు.

ఇక ఫాదర్స్ డే కు ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఎంతో మంది అసలు కమెడియన్ సుధాకర్ ఏంటి ఇలా మారిపోయారు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus