వేణుమాధవ్ ఆస్తుల లెక్కలు.. కుటుంబం పరిస్ధితి?

సినిమాల్లో నటించే హీరోకి ఒక భారీ రేటు ఉంటుంది… హీరోయిన్, విలన్ లకు కూడా బాగానే రేటు కట్టి ఇస్తారు. కానీ కమెడియన్లు మిగిలిన నటీ నటులకి మాత్రం.. ఆ స్థాయిలో ఉండవు. ఇదిలా ఉండగా… గతంలో మరణించిన ‘ఐరన్ లెగ్’ శాస్త్రి వంటి కమెడియన్ కు కనీసం ఆస్తులు లెవంటే చాలా మంది జాలి పడ్డారు. అంతేకాదు తరువాత చనిపోయిన చాలా మంది నటుల పరిస్ధితి కూడా అంతే. ఈ క్రమంలో నిన్న మరణించిన వేణుమాధవ్ గురించి ఇవే డిస్కషన్లు మొదలయ్యాయి.

గత కొన్నాళ్లుగా కాలేయ తదితర అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కనీసం సినిమా అవకాశాలు లేని వేణుమాధవ్ ఏమైనా సంపాదించాడా? ఆయన కుటుంబం పరిస్ధితి ఏంటి..? ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు ఉన్నాయి. అయితే ‘ఈసీఐఎల్ నుండీ మౌలాలి వరకూ చాలా భూముల్ని కొని ఉంచాడట వేణుమాధవ్. ఇక తన సొంత ఊరు అయిన సూర్యపేట్ వద్ద కూడా చాలా భూములు కొని ఉంచాడట. ఇక హైదరాబాద్ లో కూడా ఆయనకి కొన్ని ఇల్లు ఉన్నాయట.. వాటిని రెంట్లకి ఇస్తూ ఇప్పటికీ రానిస్తూనే వచ్చాడట. సో వేణుమాధవ్ ఫ్యామిలీ కి ఏ లోటు లేదని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus