Comedian Venu: మెగాఫోన్ పట్టుకున్న ‘జబర్దస్త్’ కమెడియన్!

  • October 1, 2022 / 08:11 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఫేమ్ వస్తుందో..? ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఓ కమెడియన్ కూడా సినిమా జనాలకు అలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఓ సినిమాను డైరెక్ట్ చేసి.. రిలీజ్ కు సిద్ధం చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. అతడు మరెవరో కాదు. ‘జబర్దస్త్’ వేణు. నటుడిగా ఆయన చాలా సినిమాలు చేశారు. తన కామెడీతో అందరినీ నవ్వించారు. ‘మున్నా’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఆ తరువాత ‘జబర్దస్త్’ షోలో స్కిట్స్ వేయడం మొదలుపెట్టారు. తన టీమ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. మెల్లగా ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఓ కథ రాసుకొని దర్శకుడిగా మారిపోయారు. పైగా అగ్ర నిర్మాత అతడిని సపోర్ట్ చేస్తున్నారు. వేణు రాసుకున్న కథ దిల్ రాజుకి నచ్చడంతో ఆయన నిర్మించడానికి ముందుకొచ్చారట. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

తెలంగాణ ఆత్మహత్యల మీద వేణు ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరెవరు నటించారనే వివరాలు బయటకు రాలేదు. కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు.. దర్శకుడు అడిగినవన్నీ సమకూర్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. ముందుగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి.. ఆ తరువాత సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. కమెడియన్ గా ఇండస్ట్రీకి దూరమైన వేణు.. దర్శకుడిగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి!

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus