యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తర్వాత సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడగా ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాలపైనే ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో తారక్ గడ్డంతోనే కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ సినిమాలో, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ దాదాపుగా ఒకే విధంగా ఉండనుందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో అంచనాలకు మించి పాపులారిటీని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలలో, వీడియోలలో గడ్డంతో కనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తారక్ కొరటాల శివ సినిమాలో గడ్డంతోనే కనిపిస్తారని ఫిక్స్ అయ్యారు. మరోవైపు ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాలో హీరోకు గడ్డం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్టీఆర్31 పోస్టర్ లో సైతం తారక్ గడ్డంతోనే కనిపించారు. మరోవైపు ఎన్టీఆర్30 సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయడం సమస్యగా మారింది.
పాన్ ఇండియాలో సత్తా చాటే హీరోయిన్ ఈ సినిమాకు అవసరం కావడంతో హీరోయిన్ ను ఎంపిక చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమాతో కొరటాల శివ నిరాశపరిచినా తర్వాత సినిమాలతో ఆయన ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం టాలెంట్ ఉంటే స్టార్ డైరెక్టర్ల సినిమా ఫ్లాప్ అయినా నమ్మి అవకాశాలను ఇస్తున్నారు.
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ జనతా గ్యారేజ్ అన్ని వర్గాల ప్రేక్శకులను ఆకట్టుకుంది. కొరటాల శివ రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ తర్వాత సినిమాను తెరకెక్కించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. సినిమాసినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!