Custody: ‘కస్టడీ’ కి ‘ధృవ’ కి ఉన్న రెండు కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?

  • May 4, 2023 / 04:01 PM IST

సాధారణంగా తమిళంలో రూపొందే సినిమాల్లో హీరో కంటే విలన్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దర్శకులు విలన్ ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్టులు రెడీ చేసుకుంటారు. విశాల్ ‘అభిమన్యుడు’, రాంచరణ్ ‘ధృవ’ కి ఒరిజినల్ అయిన ‘తనీ ఒరువన్’, మహేష్ బాబు ‘స్పైడర్’, రామ్ ‘ది వారియర్’.. ఈ సినిమాలు తీసుకుంటే ఎక్కువ విలన్ డామినేషన్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ సినిమాలో కూడా విలన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో (Custody) నాగ చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసే సినిమాల్లో విలన్ కు ప్రాధాన్యత ఎక్కువే ఉంటుంది. ఈ ‘కస్టడీ’ విషయానికి వస్తే.. ఇందులో హీరో విలన్ ను కాపాడుతూనే ఉంటాడట. విలన్ ను కాపాడటమే అతని మిషన్. ఇప్పటివరకు టచ్ చేయని పాయింట్ ఇది. అదెందుకు అన్నది సినిమా చూస్తే అర్ధమవుతుందట. ఈ విషయాన్ని చిత్ర బృందం ముందే చెప్పేసింది.

జనాలకు ఓ క్లారిటీ రావాలని ముందుగానే చెప్పేసిందట చిత్ర బృందం. అయితే ‘ధృవ’ సినిమాలో హీరో విలన్ ను కాపాడాలి అనుకుంటాడు. ఎందుకు అన్నది క్లైమాక్స్ లో చెబుతాడు హీరో. అంతేకాకుండా విలన్ కు హీరో పై ఉన్న ప్రేమతో అతను అడిగింది ఇచ్చేస్తాడు. ‘కస్టడీ’ కూడా కొంచెం అలానే అనిపిస్తుంది.

హీరో విలన్ ను కాపాడేది అతని వల్ల దాగున్న వంద మంది నేరస్థులను బయటకు లాగడం కోసమే అయ్యుంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి సినిమాలో చెప్పేది అదే అవుతుంది. అయితే ‘ధృవ’ లో విలన్ అరవింద్ స్వామి కాగా కస్టడీలో కూడా అతనే విలన్ కావడం విశేషం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus