స్టార్ హీరో ప్రభాస్ కు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా ప్రభాస్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అశ్వనీదత్ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా మేకర్స్ ను, ప్రభాస్ ను నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీ టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది.
బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తైన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తైంది. ప్రాజెక్ట్ కే సినిమాను 2023 సంవత్సరంలో మే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. బ్రహ్మాస్త్ర కథకు, ప్రాజెక్ట్ కే కథకు పోలికలు ఉండటంతో ప్రాజెక్ట్ కే మేకర్స్ కు కంగారు మొదలైందని తెలుస్తోంది. ఒక ఆయుధం కొరకు జరిగే పోరాటానికి సంబంధించిన కథలతో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాకు బ్రహ్మాస్త్ర సినిమాకు పోలికలు రాకుండా స్క్రిప్ట్ లో స్వల్పంగా మార్పులు చేస్తున్నారని సమాచారం. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి తర్వాత తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. బ్రహ్మాస్త్ర సినిమా రణబీర్ కపూర్ హీరోగా మూడు పార్టులుగా తెరకెక్కుతోంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. తెలుగులో స్టార్ డైరెక్టర్ జక్కన్న ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం గమనార్హం. నాగ్ నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో ఈ సినిమా విడుదలవుతోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!