Jr NTR: దర్శకుడు కొరటాలకు తారక్ పెట్టిన షరతులు ఇవే?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్ కు సంబంధించి కొరటాల శివకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో షరతులు విధించారని డైలాగ్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సూచించారని తెలుస్తోంది. కొరటాల శివ సైతం ఈ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా కథ, కథనాలను అద్భుతంగా సిద్ధం చేశారని బోగట్టా.

అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలు ఎక్కువగా ఆకట్టుకోకపోయినా అతనికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కొరటాల శివ రాజమౌళి సెంటిమెంట్ ను ఈ సినిమాతో బ్రేక్ చేస్తానని నమ్ముతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొరటాల శివ ఈ సినిమా బిజినెస్ లో జోక్యం చేసుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ మైథలాజికల్ టచ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివపై తారక్ నమ్మకం పెట్టుకోగా ఆ నమ్మకాన్ని కొరటాల శివ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.

ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిర్మాతలు కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ వచ్చే నెల నుంచి ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్ డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus