Thandel: అసలు తండేల్ దారెటు?

పాన్ ఇండియా రేంజ్‌లో, నాగ చైతన్య (Naga Chaitanya)కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’ (Thandel) . ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. నిర్మాతలు బన్నీ వాస్ (Bunny Vasu), అల్లు అరవింద్ (Allu Aravind) ఆలస్యం చేస్తుండటం అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది. మొదట డిసెంబర్ కు అనుకున్నప్పటికి కుదరలేదు. దీంతో సంక్రాంతికి అయితే పండగ వేళలో తమ హీరో సందడి చేస్తారని అక్కినేని ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆశిస్తున్నారు. అయితే సంక్రాంతికి గేమ్ చేంజర్  (Game Changer)  , బాలయ్య 109 (Balakrishna), వెంకటేష్ 76 (Venkatesh) వంటి పెద్ద సినిమాలు బరిలో ఉన్నందున, రిస్క్ తీసుకోవడం సులభం కాదని గీతా ఆర్ట్స్ భావిస్తోంది.

Thandel

ఈ క్రమంలో థియేటర్లలో తగ్గుదల తప్పదని, అందుకే సంక్రాంతి బరిలోకి వెళ్లి రిస్క్ చేసుకోవడం వద్దని నిర్మాతలు భావిస్తున్నారు. జనవరి చివరి వారం రిపబ్లిక్ డేని టార్గెట్ చేసి సొలోగా వస్తే, మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని నిర్మాతల అంచనా. అయితే ఫ్యాన్స్ మాత్రం సంక్రాంతికే చిత్రాన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగా రిస్క్ తీసుకోవాలనే డిమాండ్స్‌తో సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.

ఇంతకాలం కష్టపడి, సినిమాకు సరైన థియేటర్ రీచ్ దక్కకపోతే తప్పనిసరిగా నష్టమవుతుందని భావిస్తూ, అభిమానులు తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్రం పూర్తిగా షూటింగ్ పూర్తి చేసుకుందా లేదా అన్న దానిపై కూడా అభిమానులకు సందేహాలు ఉన్నాయి. ఇదే సమయంలో, నాగ చైతన్య కూడా సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తన కెరీర్ బెస్ట్ మూవీగా భావించి చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమా కోసం ఎంత తగ్గాలో అంత తగ్గి వర్క్ చేశాడు.

కానీ సంక్రాంతి టైమ్ లో సినిమా రిస్క్ తీసుకుని పెద్ద సినిమాలతో పోటీ పడటం అనేది సేఫ్ కాదు. కాబట్టి మేకర్స్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వీలైనంత తొందరగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయి పల్లవి నటన వంటి అంశాలు సినిమాపై బజ్‌ను పెంచుతున్నాయి.

కూల్ గా ఉండే రెహమాన్ కూడా కోపంగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus