Alia, Ranbir marriage: రణ్‌బీర్‌ – ఆలియా గురించి ఆసక్తికర రూమర్‌!

పెళ్లిళ్లు చాలా రకములు అని పెద్దలు చెబుతుంటారు. కానీ మేం చెప్పబోయే పెళ్లి జరిగే తీరును మాత్రం ఎక్కడా చూసి ఉండరు. ఎందుకంటే ఈ పెళ్లిని కాంట్రాక్ట్‌లతో చేయబోతున్నారు. ఛస్‌ ఊరుకోండి. ఇలాంటి పెళ్లి గురించి ఈ మధ్య విన్నాం అని అంటారా? అది వేరే కాంట్రాక్ట్‌.. మేం చెప్పేది వేరే కాంట్రాక్ట్‌లు. పెళ్లి పనుల కోసం వచ్చినవాళ్ల దగ్గర కాంట్రాక్ట్‌లు తీసుకోవడం ఈ పెళ్లిలో విశేషం. అవును పెళ్లికి అవసరమైన కేటరింగ్‌, డెకరేషన్‌, ఫొటోలు, వీడియోలు..

ఇలా ఈ పనులు చేసేవారి దగ్గర నుండి కాంట్రాక్ట్‌లు తీసుకుంటున్నారట. రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా భట్‌ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో వరుస వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్న ఈ ఇద్దరు ఈ నెల 16న ఓ ఇంటివారు కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా, పుకార్లు మాత్రం పుష్కలంగా లభిస్తున్నాయి. అలాంటి పుకార్లలో ఒకటే ఈ కాంట్రాక్ట్‌లు. పెళ్లికి వచ్చే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు… డెకరేషన్, డీజే, డిజైనర్..

ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతి టీమ్‌ నుండి కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారట. ఎందుకు అంటారా… పెళ్లి అయ్యే వరకు ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా ఉండాలనట. పొరపాటున ఏదైనా లీక్ ఆ టీమ్‌ మీద చర్యలు ఉంటాయని ఆ కాంట్రాక్ట్‌లో రాసుకుంటున్నారట. ఈ పెళ్లిని తొలుత డెస్టినేషన్ వెడ్డింగ్ స్టయిల్‌లో చేసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. అయితే రణ్‌బీర్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లోనే వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారట.

గతంలో సెలబ్రిటీల పెళ్లి విషయంలో ఇలానే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయి. అందుకేనేమో ఈ సారి కాంట్రాక్ట్‌లు రాయించుకొని మరీ జాగ్రత్త పడుతున్నారు. చూద్దాం ఈసారి వీరి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో. 15వ తేదీ నుండి పెళ్లి పనులు మొదలవుతాయని అంటున్నారు. కాబట్టి ఆ రోజు నుండి సోషల్‌ మీడియాలో సందడే సందడి అన్నమాట.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus