ప్రముఖ నటి పై వివాదాస్పద కామెంట్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెలబ్రిటీలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు సామాన్య ప్రజలు.సినీ సెలబ్రిటీలు, పోలీస్ లతో పాటు,రాజకీయ నాయకులతో కూడా నెటిజన్లు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. కొందరు దీనిని పాజిటివ్ గా వాడుకుంటుంటే.. మరికొందరు దీన్ని ఉపయోగించుకుని కొందరి పై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళపై ఇలాంటి కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అందులోనూ హీరోయిన్ల పై అయితే బూతులతో రెచ్చిపోతున్నారు. కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ నటి పై ఓ నెటిజెన్ చేసిన కామెంట్ చూస్తే.. సోషల్ మీడియాను చెడుకోసం వాడేవాళ్ళే ఎక్కువ అని అనిపించకమానదు. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ భార్య అయిన చారు అసోప.. తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఓ నెటిజెన్ ‘జాకెట్ మాత్రం వేసుకోవడం ఎందుకు.అది కూడా విప్పేయ్యి’ అంటూ కామెంట్ చేసాడు.

దీంతో కొందరు నెటిజన్లు.. అతని కామెంట్ పై అసహనం వ్యక్తం చేస్తూ.. ‘మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఇంత ఘోరంగా ఎలా కామెంట్స్ చేస్తున్నావ్’ అంటూ మండిపడ్డారు. చారు అసోపా రెండు సినిమాల్లో నటించింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది.


మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus