ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సంస్థలు రూపొందించే వెబ్ సిరీస్ లు వివాదాలపాలవుతున్నాయి. ఇప్పటికే పలు సిరీస్ లు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో అమెజాన్ ప్రైమ్ వాళ్లు రూపొందించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇటీవలే ప్రైమ్ లో విడుదల చేసిన ఈ సిరీస్ కి బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. ఇదే సమయంలో ఈ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా కొన్ని సన్నివేశాలు పెట్టారని.. హిందూ దేవుళ్లను కించపరిచారని ‘తాండవ్’ సిరీస్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల దేవుళ్లను తప్ప ఇతర మతాల దేవుళ్ల జోలికి ఎప్పుడూ వెళ్లరని.. ప్రచారం రావడం కోసం కావాలనే వివాదం రేపే సన్నివేశాలను పెడుతున్నారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. ‘తాండవ్’ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఉత్తరాదికి చెందిన కొందరు రాజకీయ నాయకులూ సైతం ఈ సిరీస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.
బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసిన ‘పాతాళ్ లోక్’ విషయంలో కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి. ‘తాండవ్’ సిరీస్ ను దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించారు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!