టైటిల్ లోగో కూడా మనోభావాలను దెబ్బతీస్తుందని హరీష్ ఊహించి ఉండదు

నిన్నమొన్నటివరకూ ఒక సినిమాలోని డైలాగ్ లేదా, హీరో/హీరోయిన్ వస్త్రధారణ లేదంటే సినిమా టైటిల్ మాత్రమే మనోభావాలను దెబ్బతీయడం చూసి ఉంటాం. కానీ.. మొట్టమొదటిసారిగా ఓ సినిమా టైటిల్ లోగో కూడా కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసింది. అది కూడా సినిమాను ఆపేస్తాం, షూటింగ్ జరగనివ్వం అని బెదిరింపులు పంపే స్థాయిలో. ఇంతకీ మేటర్ ఏంట్రా అంటే.. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో “వాల్మీకి” అనే సినిమా మొదలైన విషయం తెలిసిందే కదా. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రం లోగోలో పైన గన్ను ఉంది. దాంతో వాల్మీకి సంఘం దాన్ని తమ సంఘాన్ని, ఆ సంఘంలోని సభ్యులను అవమానపరుస్తున్నట్లుగా వాళ్ళు భావించారట. దాంతో లోగో మార్చాలని, కుదిరితే టైటిల్ కూడా మార్చాలని వాళ్ళు కోరారట. ఈ విషయాన్ని హరీష్ శంకర్ & టీం పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ.. ఈ విషయం ఇక్కడితో ఆగేటట్లుగా కనిపించడం లేదు. మరి హరీష్ శంకర్ ఈ వివాదానికి తలొగ్గి లోగోను ఏమైనా ఛేంజ్ చేస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus