సూపర్ స్టార్ రజినీకాంత్ కి (Rajinikanth) కరెక్ట్ సినిమా పడితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని ‘జైలర్’ (Jailer) సినిమా నిరూపించింది. ఆ సినిమా రజినీకాంత్ ఏజ్ కి ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. చాలా కన్విన్సింగ్ గా కూడా అనిపించింది. అందుకే ‘జైలర్’ ని ఆడియన్స్ ఎగబడి చూశారు. పెద్దగా ప్రమోషన్స్, అంచనాలు లేకుండా వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత రజినీకాంత్ నుండి వచ్చిన ‘వేట్టయన్’ (Vettaiyan) నిరాశపరిచింది.
బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో చేసిన ‘లాల్ సలాం’ (Lal Salaam) సినిమా రిజల్ట్ కూడా సేమ్. దీంతో రజనీ పని అయిపోయిందా అని అంతా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన నెక్స్ట్ మూవీ ‘కూలీ’ (Coolie) ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ పండితులకి సైతం షాకిస్తుంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అందువల్ల ఈ సినిమాపై సౌత్లోని భాషలతోనే కాకుండా, నార్త్ లో కూడా మంచి హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో ‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా రూ.120 కోట్లకి విక్రయించారట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.280 అవుతున్నట్టు ప్రచారం జరిగింది. అలా చూసుకుంటే.. ఓటీటీల నుండి అప్పుడే రూ.120 కోట్లు వచ్చేసినట్టే..!