Adipurush: ‘ఆదిపురుష్’ టీజర్లో ఆ సన్నివేశాల పై కాపీ ఆరోపణలు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ టీజర్ అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఏదో అనుకుంటే.. ఊహించనిది ఇంకేదో వచ్చినట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రభాస్ వంటి కటౌట్ శ్రీరాముడు పాత్ర పోషిస్తున్నాడు అనగానే ఈ మూవీ పై హైప్ పెరిగింది. అలాగే ముందు నుండి ఇది ఓ మోషన్ క్యాప్చర్ మూవీ అనగానే.. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే మూవీ అవుతుంది అని అంతా నమ్మారు.

కానీ టీజర్ రిలీజ్ అయ్యాక అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే టీజర్ చూస్తే ఇది ఓ యానిమేషన్ మూవీలా అనిపించింది. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. ప్రభాస్ లుక్, డైలోగ్స్ ఆకట్టుకున్నప్పటికీ .. టీజర్ లో ఉన్న మైనస్ ల మధ్య అవి జనాలకు గుర్తుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. ‘ఆదిపురుష్’ టీజర్ పై తాజాగా కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

‘థోర్‌, అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌, లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌, కాంగ్‌ స్కల్‌ ఐలాండ్‌, ఆక్వామాన్‌, హౌజ్‌ ఆఫ్‌ ద డ్రాగన్, రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌.. సినిమాల నుండి కొన్ని సీన్లు లేపారని ట్విట్టర్లో కొంతమంది పేర్కొంటున్నారు. రావణుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పక్షి పై వచ్చే సీన్ హౌజ్‌ ఆఫ్‌ ద డ్రాగన్ నుండి లేపారట.

అలాగే హారి పోటర్ నుండి కూడా ఓ సన్నివేశం లేపినట్టు చెబుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆదిపురుష్ టీజర్ ట్రెండింగ్లో ఉండడానికి ట్రోలింగ్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus