Family Star: గోపీ సుందర్ పై కాపీ మరకలు.. కొంచెమైనా చెక్ చేసుకోరా అంటూ?

  • March 26, 2024 / 10:40 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో గోపీసుందర్ (Gopi Sundar) ఒకరు కాగా గోపీ సుందర్ సినిమాలలోని సాంగ్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదట నందనందన సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో నందనందన సాంగ్ కు ఏకంగా 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ సాంగ్ గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్లు రాలేదు. అయితే రెండో సాంగ్ కళ్యాణ్ వచ్చా వచ్చా సాంగ్ ఒక్కడు (Okkadu) సినిమాలోని అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా సాంగ్ తో పాటు అరుంధతి (Arundhati) సినిమాలోని ఢోలారే ఢోలారే ఢమ్ సాంగ్ కు మిక్స్ అని కామెంట్లు వినిపించాయి. కొన్ని వీడియోల ద్వారా యూట్యూబర్లు నెట్టింట గోపీసుందర్ ను ట్రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మధురము కదా సాంగ్ రిలీజైంది.

ఈ పాట దిల్ సే సినిమాలోని జియా జలే సాంగ్ కు కాపీలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాట స్టైల్ సేమ్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్ల గురించి గోపీసుందర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. గోపీసుందర్ కూడా ఇలా చేస్తే ఎలా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తరచూ ఇలాంటి ట్రోల్స్ వచ్చేవి.

గోపీసుందర్ అలాంటి కామెంట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది. గోపీసుందర్ కెరీర్ కు ఇలాంటి కామెంట్ల వల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెగిటివ్ కామెంట్ల గురించి మేకర్స్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus