Arabic Kuthu: ‘అరబిక్‌ కుత్తు’ అసలు ట్యూన్‌ పట్టేశారు!

‘అరబిక్‌ కుత్తు… ’ అంటూ అనిరుథ్‌ ఓ కొత్త రకం పాటల్ని తీసుకొచ్చాడు అంటూ అనిరుథ్‌ ఫ్యాన్స్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ గత కొద్ది రోజులుగా పొంగిపోతున్నారు. పాట బీట్‌ మాసీగా ఉండటం, అదిరిపోయే స్టెప్పులు ఉండటంతో… యూట్యూబ్‌లో పాట దుమ్ము రేపుతోంది. 45 మిలియన్ల వ్యూస్‌ను దాటి 50 మిలియన్లవైపు దూసుకుపోతోంది. అయితే ఇదే క్రమంలో పాట ట్రోలింగ్‌ వీడియోస్‌ కూడా దూసుకుపోతున్నాయి. యూట్యూబ్‌లో Arabic kuthu అని కొట్టి చూడండి. పాటతోపాటు ట్రోలింగ్‌ వీడియోస్‌ కూడా ప్రత్యక్షమైపోతున్నాయి.

Click Here To Watch

‘అరబిక్‌ కుత్తు…’ పాట అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి. అనిరుథ్‌ మ్యూజిక్‌, శివకార్తికేయన్‌ రైటింగ్‌ మ్యాజిక్‌, జానీ మాస్టర్‌ మెస్మరైజ్‌ స్టెప్పులు, విజయ్‌ గ్రేస్‌, పూజా హెగ్డే అందచందాలు, హొయలు… అన్నీ కలిపి పాటను అంతెత్తున నిలబెట్టాయి. దీంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు. పాటను రిపీట్‌ మోడ్‌లో తెగ వినేస్తున్నారు. అయితే ట్రోలింగ్‌ వీడియోసే పంటి కింది రాయిలా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పొచ్చు. అసలేంటీ వీడియోస్‌, ఆ సంగతేంటో చూద్దాం.

‘అరబిక్‌ కుత్తు…’ పాటలో మ్యూజిక్‌ సంగతికొస్తే… అందులో ‘డంచక్‌ డంచక్‌’ అనే మాస్‌ డ్రమ్‌ బీట్‌ ఉంటుంది. ‘హలమితి హబీబో…’ అనే మాటల తర్వాతే ఆ డ్రమ్‌ బీట్‌ వస్తుంది. ఆ బీట్‌నే ఇప్పుడు షార్ట్స్‌, రీల్స్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వ్యూస్‌, లైక్స్‌ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ బీట్‌ చుట్టూనే ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ఆ బీట్‌ కొత్తదేం కాదని, గతంలో చాలా సినిమాల్లో ఈ బీట్‌ ఉందని, ఇప్పుడు అనిరుథ్‌ కాస్త రీమిక్స్‌ చేసి వాడుకున్నాడు అనేది ట్రోల్స్‌ సారాంశం.

పాటలో ఒక బీట్‌ను పట్టుకొని కాపీ అనడం, ఎత్తేశాడు అనడం సరికాదు. గతంలో చాలామంది సంగీత దర్శకులు ఇలా చేశారు కూడా. మొత్తం పాటలనే ఎత్తేస్తున్న ఈ రోజుల్లో చిన్న డ్రమ్‌ బీట్‌ను పట్టుకొని ట్రోలింగ్‌ చేయడం ఏంటి అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే ఏదైనా కాపీ కాపీనే అంటున్నారు. ఏదైతేముంది ‘హలమితీ హబీబో…’ ఎంత పేరు తెచ్చిందో అంతే ట్రోల్స్‌ తెస్తోంది అనిరుథ్‌కి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus