సినిమా పోస్టర్ చూసో, పేరు చూసో, హీరో లుక్ చూసో, టీజర్ చూసో, ట్రైలర్ చూసో.. ఇది ఆ సినిమాకు కాపీ, ఫ్రీమేక్ అని చెప్పేస్తుంటారు మన సినీ జనాలు. అంతలా అన్ని భాషల సినిమాలు చూసి అప్‌డేట్ అయిపోయారంతా. అలాంటిది సినిమా విడుదలైన పది రోజుల తర్వాత ఓ సినిమాకు కాపీ మరకలు అంటాయి అంటే ఆలోచించాల్సిందే. అలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. అవును సుహాస్ కొత్త సినిమానే.
నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యూట్యూబర్ నుండి సినిమా నటుడిగా మారిన సుహాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి. పెద్ద ఎత్తున ప్రచారం, బజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు వాళ్లు ప్రిమియర్లు వేశారు, స్పెషల్ మీట్‌లు పెట్టారు. ఆడవాళ్లకు ఒక రోజు ఉచిత ప్రదర్శన కూడా వేశారు. ఇలా సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి బాగానే కష్టపడ్డారు. ఈ సమయంలో సినిమా మీద కాపీ మరక అంటుకుంది.
ఈ కాపీ మరక టాలీవుడ్ నుండి రాలేదు. బాలీవుడ్‌కి చెందిన ఓ హిట్ సినిమా టీమ్ ఈ మేరకు కామెంట్స్ చేసింది అని వార్తలొస్తున్నాయి. సుమారు ఆదరేళ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన ‘బరేలీ కి బర్ఫీ’ అనే సినిమా టీమ్ ఈ మేరకు స్పందించింది అని సమాచారం. ‘రైటర్ భూషణ్’ సినిమా గురించి విన్నాం.. కథలో మూల విషయం, కొన్ని సీన్లు మా సినిమాతో కలుస్తున్నాయి. మూల కథని కాస్త అటు ఇటు మార్చారు. కానీ అసలు పాయింట్ మాత్రం అదే అని ‘బరేలీ కి బర్ఫీ’ టీమ్ అభిప్రాయపడింది.
అయితే ఈ వ్యవహారంపై ‘రైటర్ పద్మభూషణ్’ టీం ఇంకా స్పందించలేదు. అయితే హిందీ సినిమా చూసినవాళ్లు కూడా కాస్త అటుఇటుగా అంతే అంటున్నారు. అందులోని కొన్ని అంశాలను ఇందులో చూపించారని, అయితే పూర్తిగా అదే సినిమా అని చెప్పలేం అని చెబుతున్నారు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!