90లో విడుదలై సంచనల విజయం సాధించడంతోపాటు ఓ దశాబ్ధంపాటు అందరూ చర్చించుకున్న సినిమాల్లో ఒకటి “శుభలగ్నం”. కోటి రూపాయల కోసం కట్టుకున్న భర్తను ఓ సతీమణి అమ్మేయడం అనే క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జగపతిబాబు, ఆమని, రోజా కెరీర్ లో ఓ మైలురాయి. ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు కానీ కాన్సెప్ట్ గురించి కానీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనే క్రేజీ ఐడియా వచ్చింది ఓ యువ దర్శకుడికి. ఆమేరకు కథ సిద్ధం చేశాడు కూడా. జగపతిబాబుకి వినిపించగా ఆయన కి కూడా నచ్చగా వెంటనే ఒప్పేసుకున్నాడు కూడా.
రీసెంట్ గా “యాత్ర”తో మోడరేట్ హిట్ అందుకున్న 70 ఎం.ఎం ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. అంతా బాగానే ఉంది కానీ.. జగపతిబాబును ఫ్యామిలీ హీరోగా చూడడం మానేసి ప్రస్తుతానికి అందరూ ఒక హార్డ్ కోర్ విలన్ లా చూడడం మొదలెట్టారు. అలాంటి తరుణంలో మళ్ళీ క్లాస్ హజ్బెండ్ గా ఆయన్ని మన ఆడియన్స్ రికగ్నైజ్ చేయగలరా, ఒకవేళ చేసినా ఆదరించగలరా అనేది చర్చనీయాంశం అయ్యింది.