నాని (Nani) నిర్మించిన ‘కోర్ట్’ (Court) సినిమా ఇటీవల… అంటే మార్చి 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji) మంగపతి అనే పాత్రలో నటించి మెప్పించాడు. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.నాని కూడా ఈ సినిమాపై మొదటి నుండి సూపర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు.
ఇక ప్రీమియర్స్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి (Court ) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 6.37 కోట్లు |
సీడెడ్ | 0.92 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 5.78 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 13.07 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
5.09 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.16 కోట్లు(షేర్) |
‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 8 రోజుల్లో రూ.18.16 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.10.66 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ఈ సినిమా.. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.35.3 కోట్ల వరకు కొల్లగొట్టింది.