Jr NTR: ఎన్టీఆర్- అమిత్ షా మీటింగ్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

  • September 2, 2022 / 08:18 PM IST

ఈ మధ్యనే ఎన్టీఆర్- అమిత్ షా ల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ గురించి రకరకాల విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ బిజెపి తరుపున ప్రచారం చేయబోతున్నాడు అంటూ ఏంటేంటో కామెంట్లు చేసినవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు మెచ్చి..కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా ఎన్టీఆర్ ను పిలిపించుకుని కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా తెలిపారు. అమిత్ షా తర్వాత మరో బీజేపీ నాయకుడు జేపీ నడ్డా కూడా టాలీవుడ్‌ హీరో నితిన్‌ను కలిశారు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ – అమిత్ షా ల మీటింగ్ పై తాజాగా సీపీఐ నాయకుడు నారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ఆయన వట్టి పుణ్యానికి నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి పై ఆయన చేసిన కామెంట్లకు అభిమానులు ఏ రేంజ్లో ఫైర్ అయ్యారో అందరికీ తెలిసిందే. తర్వాత ఆయన ఆ మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు తెలిపారు.

ఇక అమిత్ షా – ఎన్టీఆర్ ల మీటింగ్ గురించి సీపీఐ నారాయణ మాట్లాడుతూ… “ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమిత్‌షా ఓ స్మగ్లర్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ గౌరవ ప్రదమైన కుటుంబం నుండి వచ్చినవాడు. అలాంటి మనిషి ఏం అవసరం వచ్చిందని ఓ క్రిమినల్‌ను వెళ్ళి కలిశాడు.అతనికి ఎందుకొచ్చిన కర్మ ఇది’’ అంటూ కామెంట్లు చేశాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సీపీఐ నారాయణ పై మండిపడుతున్నారు. ‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని’ సీపీఐ నారాయణకి వార్ణింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus