Odela 2: ‘ఓదెల 2’ కి క్రేజీ డీల్స్.. అంత బడ్జెట్ పెట్టినా రికవరీ అయిపోయింది..!

స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) హవా.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. ఈ విషయాన్ని ఆమె కూడా గ్రహించింది. ఆమె స్టార్ గా ఉన్నప్పటికీ పెట్టిన కండీషన్స్ కి ఇప్పుడు నిర్మాతలు తలవంచే పరిస్థితి లేదు. అందుకే ఒకప్పుడు ఎంత గ్లామర్ రోల్స్ చేసినా.. లిప్ లాక్స్, లవ్ మేకింగ్ సీన్స్ వంటి వాటికి ఆమె దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సీన్స్ కి ఈజీగానే ఒప్పుకుంటుంది. కాకపోతే.. పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తుంది.

Odela 2

అలాగే గ్లామర్, రొమాన్స్ వంటివి వాటికి మాత్రమే కాదు ఎటువంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా తమన్నా రెడీ అంటుంది. ‘అరణ్మననై 4’ లో (Aranmanai 4) దెయ్యం రోల్ చేసింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కూడా కొంచెం అలాంటి పాత్రే. ఇక ‘జైలర్’ (Jailer) ‘స్త్రీ 2’ (Stree 2) వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. ఇలాంటి టైంలో ‘ఓదెల 2’ అనే సినిమాలో ఆమె మెయిన్ రోల్ చేసే ఛాన్స్ దక్కించుకుంది.

‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) కి సీక్వెల్ ఇది. మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయ్యి సైలెంట్ సక్సెస్ అందుకుంది. అందుకే ‘ఓదెల 2’ పై హైప్ నెలకొంది. ఈ మధ్యనే టీజర్ కూడా విడుదలైంది. అది ట్రేడ్లో కూడా అంచనాలు పెంచింది అని చెప్పాలి. దీంతో బిజినెస్ కూడా బాగా జరిగిందట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రూ.20 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట.

ఓటీటీ రైట్స్ రూపంలో రూ.12 కోట్ల వరకు వెనక్కి వచ్చాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ వంటి వాటి రూపంలో రూ.7 కోట్ల వరకు వెనక్కి వచ్చింది. శాటిలైట్, ఆడియో వంటి రైట్స్ రూపంలో ఇంకో రూ.2 కోట్లు, రూ.3 కోట్లు వెనక్కి రావచ్చు. సో ఎలా చూసుకున్నా.. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చిపెట్టినట్టు అనుకోవాలి. ఇక థియేటర్లలో కనుక సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే.. లాభాల లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఆస్పత్రిలో చేరిన రెహమాన్‌.. డిశ్చార్జి కూడా.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus