Jr NTR , Trivikram: తారక్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా.. ఆ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava) సినిమా తెరకెక్కగా ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ భావించారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందనే సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తారక్, త్రివిక్రమ్ ఒకటి రెండు సందర్భాల్లో కలిసినా ఒకే వేదికపై కనిపించలేదు.

నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చాలా సందర్భాల్లో తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఆ సినిమా భారీ సినిమా కావడంతో సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ కు తారక్ హాజరు కానుండగా త్రివిక్రమ్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. టిల్లూ స్క్వేర్ (Tillu Square) సినిమాకు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య (Sai Soujanya) సహనిర్మాత కావడం గమనార్హం. అందువల్ల త్రివిక్రమ్ ఈ వేడుకకు హాజరవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కు సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ను ఈ సినిమా ఎన్నో రెట్లు పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తారక్ రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus