పరుశురాం మహేష్ కోసం ఓ ట్రెండీ సబ్జెక్టు తో వచ్చాడని తెలుస్తుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ, అందులోని లొసుగులు, ఆర్థిక నేరాలు వంటి విషయాల ప్రధానంగా మహేష్ మూవీ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. విషయంలోకి వెళితే నిన్నటి నుండి మహేష్ టైటిల్ పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మహేష్ మూవీ కోసం పరుశురాం సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారని. మహేష్ తో ఆయన చేస్తున్న కథకు ఈ టైటిల్ చాలా బాగా సూట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.
అలాగే ఈ టైటిల్ పై మహేష్ సానుకూలంగా స్పందించడంతో దాదాపు దీనినే పరుశురాం ఫిక్స్ చేశారు అనేది మీడియాలో వస్తున్న కథనాలు. కాగా ఈ మూవీకి ఆ టైటిల్ అనుకోవడానికి కారణం ఈ మూవీ నేపథ్యం బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక నేరాలు వంటి విషయాల చుట్టూ తిరుగుతుందట. దేశంలో ఈ మధ్య భారీ ఆర్థిక నేరాలు జరిగాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు వేల కోట్లు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు.
ఈ నేపథ్యంలో ఈ ట్రెండీ టాపిక్ పై మూవీ తీస్తే ఫుల్ వర్క్ అవుట్ అవుతుందని మహేష్ మరియు పరుశురాం ఆలోచనట. ఈ సోషల్ బేస్డ్ కాన్సెప్ట్ కి మహేష్ మార్క్ కమర్షియల్ అంశాలు చేకూర్చి పరుశురాం బెస్ట్ స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేశారట. అందుకే మహేష్ అందరినీ కాదని పరుశురాం కి ఓటేశాడని సమాచారం. మరి మహేష్ రోల్ బ్యాంక్స్ దోచేవాడిగా ఉంటుందో లేదా, దోచినవాడి అట కట్టించే వాడిగా ఉంటుందో చూడాలి.