ఆచార్య‌ మూవీ.. అదిరిపోయే మ్యాట‌ర్..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న బిగ్ మూవీ ఆచార్య‌. ఈ మెగా 152వ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్‌ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. మాస్ అండ్ సోష‌ల్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌ల‌పుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే మెగా అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే సెట్స్ మీద‌కు వెళ్ళిన ఈ చిత్రం, క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే ఆచార్య షూటింగ్ ‌పునః ప్రారంభించ‌డానికి చిత్ర‌యూనిట్ సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో నవంబ‌ర్ 9 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇక కోవిడ్ సిట్యువేష‌న్స్ ఉన్నందున, చిత్ర యూనిట్ అన్ని జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ స్టార్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే హైదరాబాద్ లోనే ఆచార్య కోసం భారీ సెట్ వేసిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 9 నుండి అందులోనే ఈ భారీ షెడ్యూల్‌ జరగనుంద‌ని స‌మాచారం. ఈ లాంగ్ షెడ్యూల్‌లోనే ఆచార్య‌ సినిమాకు సంబంధించిన మేజ‌ర్ పార్ట్ పూర్త‌వుతుంద‌ని, షూటింగ్ స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా కొర‌టాల శివ అండ్ టీమ్ ముండుగానే మొత్తం ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకున్న నేప‌ధ్యంలో, ఆమె ఆచార్య సెట్స్‌లో వెంట‌నే జాయిన్ అవుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక ఈ క్రేజీ కాంబినేష‌న్ పై అంచానాలు ఓ రేంజ్‌లో ఉండ‌డంతో, టేకింగ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల, సీన్స్ అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల అయితే ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న రామ్ ‌చ‌ర‌ణ్ ఎపిసోడ్ కూడా హైలెట్‌గా ఉంటుంద‌ని టాక్. 2021 సమ్మ‌ర్ సీజ‌న్‌లో ఆచార్య‌ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. మ‌రి ఈ మెగా మూవీ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus