Jersey Movie: క్రికెటర్ కామెంట్స్ పై నాని రెస్పాన్స్!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ముఖ్యంగా నానికి రంజీ జట్టులో ఆడే ఛాన్స్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్లి.. ట్రైన్ శబ్దం మాటున గట్టిగా అరుస్తూ భావోద్వేగానికి గురయ్యే సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఎంపికైన తెలుగు యువకుడు హరి శంకర్ రెడ్డి మాట్లాడారు.

తాను సీఎస్‌కే టీమ్ కు ఎంపికైనట్లు తెలిసినప్పుడు ‘జెర్సీ’ సినిమాలో నానిలానే ఎమోషనల్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ‘జెర్సీ’ సినిమాతో తను ఎంతగానో కనెక్ట్ అయ్యాయని.. క్రికెటర్ల భావోద్వేగాలను ఆ సినిమా చాలా బాగా చూపించారని.. మెయిన్ గా ట్రైన్ సీన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాయని అన్నారు. సాధారణ ప్రజలకు ఆ సీన్ ఓవరాక్షన్ లా ఉండొచ్చు కానీ.. క్రికెటర్లకు ఆ బాధ ఏంటో తెలుసునని చెప్పారు. తనకు ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ వచ్చినప్పుడు.. రూమ్ లోకి వెళ్లి గట్టగా అరిచినట్లు.. ఇది కలా..? నిజమా..? అని అనుకున్నట్లు.. ఆ సమయంలో ‘జెర్సీ’ సినిమాలో సీన్ గుర్తొచ్చింది హరి శంకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ వీడియో చెన్నై సూపర్ కింగ్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నానిని ట్యాగ్ చేస్తూ వీడియో చూడాలని కోరింది. దానికి నాని చూసేసా.. అని బదులిస్తూ లవ్ సింబల్ తో రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో కడప జిల్లాకు చెందిన హరిశంకర్ రెడ్డిని సీఎస్‌కే రూ. 20 లక్షలు చెల్లించి కోలుగోలు చేసింది. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్ లో హరిశంకర్ ఏకంగా కెప్టెన్ ధోనీనే బౌల్డ్ చేసి ఆశ్చర్యపరిచారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus