అక్కినేని నాగచైతన్య హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ లో రూపొందిన పాటలు పర్వాలేదు అనిపించాయి. మే 12న రిలీజ్ అయిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో అయితే నమోదు కాలేదు.నిన్న సోమవారం రోజు కూడా కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.43 cr
సీడెడ్
0.48 cr
ఉత్తరాంధ్ర
0.52 cr
ఈస్ట్
0.32 cr
వెస్ట్
0.25 cr
గుంటూరు
0.40 cr
కృష్ణా
0.33 cr
నెల్లూరు
0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.25 cr
తమిళనాడు
0.25 cr
ఓవర్సీస్
1.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.53 cr (షేర్)
‘కస్టడీ'(Custody) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.5.53 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.17.67 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు..
వీక్ డేస్ లో ఇలాగే స్టడీగా రాణించి రెండో వీకెండ్ కు గ్రోత్ చూపిస్తే ఛాన్సులు ఉంటాయి. పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు కాబట్టి ఆ ఛాన్స్ ఉంది.