నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. వీటి తర్వాత ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మించారు.బాబీ కొల్లి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలకి షోలు వేసి చూపించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
రాజస్థాన్ కి చెందిన విరాజ్ సుర్వి(బాబీ డియోల్).. అక్కడి జనాలని చిత్ర హింసలు చేస్తూ ఉంటాడట.ఆ తర్వాత అతని కన్ను తెలుగు రాష్ట్రాలపై పడుతుంది అని తెలుస్తుంది. ఈ క్రమంలో నానాజీ(హీరో బాలకృష్ణ) ఇతన్ని ఎలా అడ్డుకున్నాడు? తర్వాత ఒక పాప కోసం ఓ కుటుంబంలోకి ఎందుకు అడుగుపెట్టాడు? అసలు ఆ పాప ఎవరు? నానాజీ.. డాకు మహారాజ్ గా చేసింది ఏంటి? అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది.
‘డాకు మహారాజ్’ కథ పరంగా కొత్తగా ఏమీ అనిపించిందట. కానీ దర్శకుడు బాబీ స్క్రీన్ ప్లే కొత్తగా.. మెప్పించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ బాగా వచ్చిందట. స్క్రీన్ ప్లే మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తుంది. బాలకృష్ణని కొత్త డైమెన్షన్లో చూపించడంలో కూడా దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడు అని అంటున్నారు. యాక్షన్ తో పాటు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని.. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.