నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న అంటే మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇప్పటి వరకు ఈ సినిమా నుండీ ఇంప్రెసివ్ కంటెంట్ రాలేదు అనే కంప్లయింట్ ఉంది. ట్రైలర్ విషయంలో కూడా అంతే. అందుకే మేకర్స్ మరో ట్రైలర్ ను వదిలారు. కొద్ది సేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది.
ఇక రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. 1: 37 సెకన్ల నిడివి కలిగి ఉంది.ఇందులో కంప్లీట్ గా బాలయ్యనే హైలెట్ చేశారు. అభిమానులకు కావాల్సింది కూడా అదే. ‘ వంటి పై 16 కత్తిపోట్లు, బుల్లెట్ .. వంటివి దిగినా కింద పడకుండా అంత మందిని నరికాడు అంటే అతను మామూలు మనిషి కాదు వైల్డ్ యానిమల్ ‘ విలన్ పలికే డైలాగ్ తో ఆరంభంలోనే మంచి హై ఇచ్చారు. అటు తర్వాత మెయిన్ విలన్ బాబీ డియోల్ ని పరిచయం చేశారు.
అతనికి బాలయ్య సీరియస్ వార్నింగ్ ఇస్తూ ‘రాయలసీమ మేరే అడ్డా’ అంటూ పలికే డైలాగ్ విజిల్ వర్త్ అనాలి. అటు తర్వాత ‘ ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు.. నేను చంపడంలో చేశా’ అనే డైలాగ్ కూడా మంచి మాసీగా ఉంది. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. మీరు కూడా ఒకసారి చూడండి: