Daaku Maharaaj: ఆనందంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌.. ఎందుకంతా హ్యాపీనెస్‌ తెలుసా?

సౌత్‌ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతోంది. మన సినిమా గురించి చాలా దేశాల్లో మాట్లాడుకుంటున్నారు. అలా అని ఆ సినిమాలన్నీ పాన్‌ ఇండియా సినిమాలు అనుకునేరు. మన దగ్గర సగటు చిత్రంగా విడుదలైన ఓ మంచి విజయం అందుకున్న సినిమాల గురించి కూడా మాట్లాడుతున్నారు. అలా లేటెస్ట్‌గా విదేశాల్లో వినిపిస్తున్న మన సినిమా ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj). బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబి (K. S. Ravindra) కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన ఈ సినిమా గురించి దుబాయి మీడియాలో వచ్చింది.

Daaku Maharaaj

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘డాకు మహారాజ్‌’ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. వసూళ్లతోపాటు పాటు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా గురించి ఇరాక్‌లోని ఓ న్యూస్‌ పేపర్‌లో ఓ ఆర్టికల్‌గా వచ్చింది. దీంతో మరోసారి ‘డాకు మహారాజ్‌’ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలను ఎక్స్‌లోని బాలకృష్ణ అభిమానుల ఖాతాల్లో కనిపిస్తున్నాయి.

ఇదీ మా బాలయ్య రేంజి అంటూ మాట్లాడుతున్నారు. అంతగా ఏముంది అనేగా.. ఆ సినిమాలో వాడిన టెక్నాలజీ గురించే రాసుకొచ్చారు. ‘డాకు మహారాజ్‌’ సినిమాలో అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని, సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు బాగున్నాయని ఇరాక్‌ మీడియా రాసుకొచ్చింది. అంతేకాదు సినిమాలో హీరో పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని రాబిన్‌హుడ్‌ తరహాలో ఆ పాత్రను తీర్చిదిద్దారని కూడా అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా కథ, వసూళ్ల వివరాలు కూడా రాసుకొచ్చారు.

అలా తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్‌ న్యూస్‌ పేపర్‌లో రావడం అరుదంటూ బాలయ్య అభిమానులు ముచ్చటపడుతున్నారు. సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్‌’ సినిమాలో బాలకృష్ణతోపాటు ప్రజ్ఞా జైస్వాల్‌(Urvashi Rautela), శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath) , ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), బాబీ డియోల్‌  (Bobby Deol ) తదితరులు ఇతర కీలకపాత్రధారులు. ఆ పేపర్‌లో రాసుకొచ్చినట్లుగానే సినిమాకు మన దగ్గర మాస్‌ రెస్పాన్స్‌ బాగానే వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి అక్కడ రాశారు అనేది తెలియాలి.

మొదటి సినిమా రిజల్ట్ పై ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ దర్శకుడి స్పందన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus