సల్మాన్ ఖాన్ పై ఫైర్ అయిన దబాంగ్ డైరెక్టర్..!

హీరో సుశాంత్ మరణం పరిశ్రమలో అణగదొక్కబడిన అనేక మంది నిస్సహాయులు గళం విప్పేలా చేసింది. బాలీవుడ్ లో పాతుకుపోయిన కొన్ని కుటుంబాలు.. పెద్దలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేనివారిని తొక్కివేస్తున్నారని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ ఆక్రోశం, ఆవేదన తెలియజేస్తున్నారు. ఇప్పటికే కంగనా రనౌత్, మీరా చోప్రా, వివేక్ ఒబెరాయ్ మరియు శేఖర్ కపూర్ లాంటివారు బహిరంగంగానే కొందరిపై విమర్శలు గుప్పించారు. ఈ లిస్ట్ లో మరో దర్శకుడు కూడా చేరారు.

సల్మాన్ మరియు అతని కుటుంబం నా కెరీర్ ని నాశనం చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఆ దర్శకుడు ఎవరో కాదు డైరెక్టర్ అభినవ్ కశ్యప్. 2010లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్‌ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా 2012లో దబాంగ్ 2 రాగా ఆ ప్రాజెక్ట్ నుండి అభినవ్ కశ్యప్ ని తొలగించారు.

ఆ సినిమాకు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌, అతని కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని అభినవ్‌ కశ్యప్‌ ఆరోపించాడు.సల్మాన్ సొదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్‌ లు నన్ను బెదిరించే వారని, భయపెడుతూ మెస్సెజ్ లు పెట్టేవారని ఆయన అన్నారు. 2013లో నేను చేసిన బేషరం చిత్రాన్ని ఆపేందుకు వారు ఎంతగానో ప్రయత్నించారు.


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags