అభిరామ్ ఎంట్రీ ఖాయమైనట్లే!

సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అయిన అభిరామ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది.

‘పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తో అభిరామ్ మొదటి సినిమా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా అభిరామ్ ఓ విలేఖరితో చెప్పడం విశేషం. తరుణ్ ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నానని అభిరామ్ చెప్పాడు. తరుణ్ భాస్కర్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వెల్లడించారు. దీన్ని బట్టి తరుణ్ భాస్కర్ చేయబోయే సినిమాలో హీరోగా అభిరామ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus