మాకో “మనం” సినిమా కావాలి : రాణా
- June 30, 2016 / 10:22 AM ISTByFilmy Focus
దగ్గుబాటి కుటుంబంలో ఉన్న హీరోలందరితో కలిసి “మనం” లాంటి ఓ ఫ్యామిలీ సినిమాలో నటించాలన్నది స్వర్గీయ రామానాయుడు చివరి కోరిక, ఆ కోరిక తీరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. తాత చివరి కోరికను తీర్చేందుకు మనవడు రాణా నడుం బిగించాడు.
చిన్నాన్న వెంకటేష్ తో కలిసి ఓ సినిమాలో నటించాలనుందని రాణా ఇవాళ ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన తమ్ముడు అభిరామ్ తో కూడా ఈ సినిమాలో ఓ పాత్ర పోషింపజేయాలన్నది రాణా ఆలోచన. ఎప్పట్నుంచో కథలు వింటూనే ఉన్నాడట, కానీ ఏదీ నచ్చడం లేదని, త్వరలో ఒక కథను ఫైనల్ చేసి తాత కోరిక తీరుస్తానని పేర్కొన్నాడు రాణా!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















