బిగ్ బాస్ 4: రీ ఎంట్రీ వస్తే వాళ్లకి డేంజర్..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. 12వ వారంలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎలిమినేట్ అయిపోయిన పార్టిసిపెంట్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా నోయల్ లేదా కుమార్ సాయిల్లో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు రీ ఎంట్రీ అనేది ఇప్పుడు ఇవ్వడం కరెక్టేనా..? ఒకవేళ వస్తే ఏమవుతుంది అనేది చర్చలు చేస్తూ సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు.

నోయల్ రీ ఎంట్రీ ఇస్తే అది హారికకి – అభిజిత్ కి మంచి ఫేవర్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చినవాళ్లు నామినేషన్స్ లోకి రాకపోయినా, ఫినాలే ఛాలెంజ్ ని పూర్తిచేసి ఫినాలే టిక్కెట్ గెలిచినా హౌస్ మేట్స్ కి బిస్కెట్ అయిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ఫస్ట్ డే నుంచి గేమ్ ని ఆడుతూ ఇంతదూరం వచ్చిన హౌస్ మేట్స్ ఇప్పుడు రీ ఎంట్రీ పార్టిసిపెంట్ వల్ల డేంజర్ జోన్ లోకి వెళ్లి , ఎలిమినేట్ అయిపోతే గేమ్ లో అర్ధమే లేదని చెప్తున్నారు. దానివల్ల స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్లిపోతే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అన్ ఫెయిర్ డెసీషన్ అవుతుందని చెప్తున్నారు.

అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ఆడుతున్నారని, వైల్డ్ కార్డ్ రీఎంట్రీ వల్ల వాళ్ల గేమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి చూద్దాం.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా వస్తారా..? లేదా ఒకవారం ఎలిమినేషన్ ని ఎత్తేస్తారా అనేది చూడాలి.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus