ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న `మిఠాయి`

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం `మిఠాయి`. ప్ర‌శాంత్‌కుమార్ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్ర‌త్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న రాహి పోస్టర్ ను ఈ సందర్భం గా రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా… చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ “వికారాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో లిబ‌రేష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రించాం. దీంతో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. `పెళ్ళిచూపులు` సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. డార్క్ కామెడి జోన‌ర్‌లో విభిన్నమైన క్యారెక్ట‌ర్స్ న‌డుమ సాగే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus