Darling First Review: ‘డార్లింగ్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ప్రియదర్శి (Priyadarshi)  హీరోగా ‘డార్లింగ్’ (Darling)  అనే సినిమా రూపొందింది. నభా నటేష్ (Nabha Natesh) ఇందులో హీరోయిన్. ‘హనుమాన్’ (Hanu Man)  వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ అందించిన ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, అతని భార్య చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నభా నటేష్ ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన అమ్మాయిగా కనిపించనుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను వీక్షించి ఎంతో కాన్ఫిడెంట్ గా రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ఇండస్ట్రీ పెద్దలు కూడా తమ హానెస్ట్ ఒపీనియన్ ని షేర్ చేశారట. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా గడిచిపోయిందని, ఎక్కడా కూడా బోర్ కొట్టలేదని ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా సెకండ్ హాఫ్ పై ఎక్సయిట్మెంట్ పెంచిందని అంటున్నారు.

ఇక సెకండాఫ్ కూడా ఎంటర్టైన్మెంట్ తో ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉందని అంటున్నారు. సినిమాలో కూడా ఎక్కడా కూడా వల్గారిటీకి తావివ్వకుండా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్టు చెబుతన్నారు. చివరి 20 నిమిషాలు అయితే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతారని వారు తెలియజేశారు. మరి రిలీజ్ రోజున ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus