Darshan: రేణుకాస్వామి కేసులో షాకింగ్ ట్విస్ట్.. దర్శన్ చెప్పిన విషయాలివే!

ఈ మధ్య కాలంలో రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శన్ ఈ హత్య చేశాడని ఆరోపణలు వినిపించగా దర్శన్ (Darshan) మాత్రం తనకు ఏ పాపం తెలియదని తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నారు. విచారణ సందర్భంగా పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని దర్శన్ వెల్లడించారు. పవిత్రా గౌడకు అశ్లీల చిత్రాలు పంపడం వల్లే రేణుకాస్వామిపై తాను చేయి చేసుకున్నానని దర్శన్ అన్నారు. తాను రేణుకా స్వామిని రెండు దెబ్బలు కొట్టి బయటకు వచ్చానని మిగతా వాళ్లు అతనిని హత్య చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

రేణుకాస్వామిని తీసుకొచ్చేంత వరకు నాకు ఈ విషయం తెలియదని రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకెళ్లారని రేణుకాస్వామితో పవిత్ర గౌడకు క్షమాపణలు చెప్పించాలని మాత్రమే నేను తీసుకొని వెళ్లానని దర్శన్ వెల్లడించారు. నన్ను, పవిత్రను చూసిన వెంటనే రేణుకాస్వామి తప్పైందని చేతులు జోడించాడని ఆ సమయంలో నేను జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి ఇంటికి వచ్చేశానని దర్శన్ చెప్పుకొచ్చారు.

దర్శన్ చెప్పిన విషయాల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దర్శన్ అభిమానులు మాత్రం అతను ఏ తప్పు చేసి ఉండడని భావిస్తుండటం గమనార్హం. దర్శన్ ఈ కేసు నుంచి బయటపడాలని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. దర్శన్ సినీ కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్టేనని తెలుస్తోంది. దర్శన్ పై ఆరోపణలు నిజమని తేలితే అతనిపై బ్యాన్ విధించే ఆలోచనలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

దర్శన్ ఈ కేసు నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది. దర్శన్ కేసుకు సంబంధించి ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ స్టేటస్ ఉన్న దర్శన్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం అభిమానులకు సైతం షాకిస్తోంది. ఇలాంటి పనుల వల్ల దర్శన్ అభిమానులను కోల్పోతున్నారనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus