ప్రభాస్, బన్నీ నా ఫేవరెట్ హీరోస్ – దర్శన బానిక్

పొరుగు సినిమాలను చూసి ఆనందించడమే కాదు.. విజయాన్ని అందించడం కూడా తెలుగువారికి అలవాటు. అలాగే ఇతర భాషా నటీనటులను కూడా ఆరాధిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ ప్రేమ కొంచెం ఎక్కువగా ఉంటోంది. అందుకే మన దర్శకనిర్మాతల అందమైన భామలకు పక్క రాష్ట్రాలవైపు చూస్తుంటారు. అలాగే ఆంధ్రుడు, పెదబాబు చిత్రాల దర్శకుడు పరుచూరి మురళికి దర్శన బానిక్ కంటపడింది. బెంగాలీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఆటగాళ్లు సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకాబోతోంది. ఈ సంధర్బంగా దర్శన బానిక్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది.

“ఆటగాళ్లు సినిమాలో నా పాత్ర పేరు అంజలి. సింపుల్ గా చెప్పాలంటే తను చాలా ఇండిపెండెంట్, వర్కింగ్ లేడి. సినిమాలోని హీరో పాత్రను సిన్సియర్ గా లవ్ చేస్తోంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది” అని తన పాత్ర గురించి వెల్లడించింది. ఇక మీకు నచ్చిన తెలుగు హీరో ఎవరు ? అని అడగగా.. ఇలా స్పందించింది. ” తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలు చూసాను. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుధంతి, బాహుబలి సిరీస్ ఇలా అన్ని చూసాను. నాకు బాహుబలి మూవీ చాలా బాగా నచ్చింది. అప్పుడే నేను ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. డైరెక్టర్ ల్లో రాజమౌళికి నేను పెద్ద అభిమానిని” అని వెల్లడించింది. ఆటగాళ్లు హిట్ అయితే ఈ బెంగాలీ భామ తెలుగు హీరోలకు మరింత దగ్గర కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus