Das Ka Dhamki Trailer: మళ్ళీ బూతులు మొదలుపెట్టిన విశ్వక్ సేన్..!

  • November 18, 2022 / 10:09 PM IST

విశ్వక్ సేన్ అంటే భూతులు.. భూతులు అంటే విశ్వక్ సేన్ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అందుకే అతను నిత్యం వివాదాల్లో నిలుస్తుంటాడు. అతని ప్రతి సినిమాకి వివాదాలే హైప్ తీసుకొస్తాయి అని నమ్ముతుంటాడో ఏమో..కానీ తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులకు ఎక్కువ స్కోప్ ఉంటుంది! అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు క్లీన్ ఎంటర్టైనర్స్ గా రూపొందాయి. ముఖ్యంగా ‘ఓరి దేవుడా’ సినిమా ప్రమోషన్ల విషయంలో అతను ఎటువంటి హడావుడి చేయలేదు. దీంతో విశ్వక్ ఇక మారిపోయాడు అని అంతా అనుకున్నారు.

అయితే తాజాగా వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ చూస్తే అతను ఇంకా మారలేదు అనే ఫీలింగ్ కలుగక మానదు. 2 నిమిషాల 56 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్.. యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ట్రైలర్ లో కొంచెం నాని- ఇంద్రగంటి కాంబినేషన్లో వచ్చిన ‘జెంటిల్ మన్’ మూవీ ఛాయలు కనిపిస్తున్నాయి.అంటే విశ్వక్ ఈ మూవీలో డబుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు క్లియర్ అవుతుంది.ఒక పాత్ర రిచ్.. ఇంకో పాత్ర పూర్ అన్న మాట. అయితే ఇంకో పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది చూపించలేదు.

డాక్టర్ గా రెండో పాత్ర ఉండబోతుంది అనే హింట్ అయితే ఇచ్చారు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయి అని ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే విశ్వక్ సేన్ బూతుల పైత్యం మాత్రం ఇంకా తగ్గించుకోలేదు. ట్రైలర్ లో పలు చోట్ల భూతులు ఉండటాన్ని మనం గమనించవచ్చు.ట్రైలర్ లోనే ఇన్ని భూతులు ఉంటే ఇక సినిమాలో ఎన్ని ఉంటాయో.

ఇక ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తుండగా.. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు వంటి చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయని వినికిడి.ఇక లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీని ‘వన్మయే క్రియేషన్స్’, ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus