Dasara First Review: ‘దసరా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించారు. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటించాడు. టీజర్, ట్రైలర్ రెండు పాటలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.

నాని ఈ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధిస్తాడు అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మార్చ్ 30 న అంటే రేపు ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య కాలంలో మంచి హైప్ ఉన్న సినిమా రాలేదు. దసరా కి అది పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి.అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ఆ రేంజ్ కంటెంట్ ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇండస్ట్రీ సర్కిల్స్ కు చెందిన జనాలు ఈ చిత్రం షో స్పెషల్ షో చూడటం జరిగింది. సినిమా చూశాక వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వాళ్ళ టాక్ అయితే తేడాగానే ఉందని చెప్పాలి. వారి టాక్ ప్రకారం.. దసరా సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టు పక్కా రా అండ్ రస్టిక్ గా ఉందట. ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్ గా ఉందట. సెకండ్ హాఫ్ లో మితిమీరిన వయోలెన్స్ ఉంటుందట. అయితే టీజర్ లో చూపించినట్టు..

నాని తనను చంపడానికి వచ్చిన విలన్ బ్యాచ్ ను .. చంపి ఫైనల్ గా రక్తంతో బొట్టు పెట్టుకునే సీన్ బాగుంది అని తెలుస్తుంది. హీరోయిన్ విషయంలో ఓ బోల్డ్ అటెంప్ట్ చేశారట. అది చెబితే స్పాయిలర్ అవుతుంది అని , ఫ్రెండ్ గా చేసిన దీక్షిత్ శెట్టి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

ఇది పక్కా తెలంగాణ స్లాంగ్ తో రూపొందిన మూవీ (Dasara) కాబట్టి, డైలాగులు అర్థం కావడం కష్టమని వారు చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుందట. సెకండ్ హాఫ్ ను దర్శకుడు శ్రీకాంత్ డీల్ చేసిన విధానం పేలవంగా ఉందని.. ఇది బిలో యావరేజ్ సినిమా అని అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus