Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » దాసరి నారాయణ రావు సినీ అడుగులు

దాసరి నారాయణ రావు సినీ అడుగులు

  • May 31, 2017 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాసరి నారాయణ రావు సినీ అడుగులు

బహుముఖ ప్రజ్ఞాశాలి .. ఈ మాటకు సరిగ్గా సూటయ్యే మహానుభావుడు దాసరి నారాయణరావు. దర్శకుడిగా అద్భుత చిత్రాలను తెరకెక్కిస్తూనే అప్పుడప్పుడు నటుడిగా వెండితెరపై మెరిశారు. మెప్పించారు. గేయ రచయితగా క్లాసిక్ పాటలను అందించారు. నిర్మాతగా తనదైన ముద్రవేశారు. తన 50ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎంతోమందిని నటులుగా, దర్శకులుగా తీర్చిదిద్ది గురువుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోను తిరుగులేదని అనిపించుకున్నారు. అటువంటి దర్శకరత్న సినీ పయనం పై ఫోకస్..

రైతు బిడ్డDasari Narayana Raoపశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ వ్యవసాయ కుటుంబంలో దాసరి నారాయణరావు పుట్టారు. దాసరి తండ్రి పేరు సాయిరాజు. దాసరికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా పిచ్చి. డిగ్రీలో ఉండగానే చిన్నచిన్న నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా నాటకాలు వేసుకుంటూ సినీ రంగానికి వచ్చారు.

తొలి చిత్రం తాత-మనవడుDasari Narayana Raoఅప్పట్లో అగ్ర నిర్మాతగా ఉన్న రాఘవగారు నిర్మించిన “తాత-మనవడు” చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

అవార్డులుDasari Narayana Raoరెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. “కంటే కూతుర్నే కను” చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. అలాగే 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు. గోరింటాకు, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ, మేఘ సందేశం చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుDasari Narayana Raoదాసరి 150కిపైగా చిత్రాలకు తెరకెక్కించారు. అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించిన దాసరి… 250కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించడం విశేషం. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు.

నటుడిగాను నందులు వరించాయిDasari Narayana Raoసుమారు 63 సినిమాల్లో రకరకాల పాత్రల్లో దాసరి మెప్పించారు. మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, మేస్త్రీ, ఎర్రబస్సు లాంటి చిత్రాల్లో నటనతో దాసరి ఆకట్టుకున్నారు. మేస్త్రి, మామగారు చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

కళాప్రపూర్ణ పురస్కారంDasari Narayana Raoప్రజలను ప్రభావితం చేసే ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దాసరి… నాటక, సినీ రంగంలో విశేష కృషికి గాను 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం అయన్ని కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. 2001లో జీవిత సాఫల్య పురస్కారాన్ని దాసరి అందుకున్నారు.

కొత్త నటులకు ప్రోత్సాహంDasari Narayana Raoదాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ప్రతిభను ప్రోత్సహించేవారు. తన కెరీర్లో13 మంది హీరోయిన్స్ ని, 15 మందికిపైగా హీరోలను, ఎంతో మంది దర్శకులు, సంగీత దర్శకులు, నృత్యదర్శకులను తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం చేశారు.

పాలకొల్లు నుంచి పార్లమెంట్ దాకా దాసరి పయనం సాగింది. ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని విజయాలను అందుకున్నారు. చివరకి రెండునెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మే 30 న తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫిల్మ్ ఫోకస్ కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari Narayana Rao
  • #Dasari Narayana Rao and Mohan babu
  • #Dasari Narayana Rao Awards
  • #Dasari Narayana Rao Family
  • #Dasari Narayana Rao Health

Also Read

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

related news

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

trending news

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

29 mins ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

36 mins ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

2 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

2 hours ago
Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

2 hours ago

latest news

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

2 hours ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

2 hours ago
దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

2 hours ago
తెలుగులో మాత్రమే హిట్లు ఇచ్చిన ఏకైక తమిళ డైరెక్టర్.. కార్ యాక్సిడెంట్లో అలా..!

తెలుగులో మాత్రమే హిట్లు ఇచ్చిన ఏకైక తమిళ డైరెక్టర్.. కార్ యాక్సిడెంట్లో అలా..!

3 hours ago
Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version