David Warner: రాజేంద్రప్రసాద్ కామెంట్స్ కు వార్నర్ ఏమన్నారంటే..!

ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు (David Warner) ఇండియాలో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. పుష్ప (Pushpa) స్టెప్స్‌, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) డైలాగులు, టాలీవుడ్ మాస్ స్టైల్‌తో వార్నర్‌కు సోషల్ మీడియాలోనే కాదు, మిలియన్ల మందిలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ (Robinhood)  సినిమాతో అతిథి పాత్రలో తెలుగు తెరపై కనబడనున్నాడంటే, టాక్ ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)  చేసిన కామెంట్స్ మాత్రం కొంతమంది అభిమానులను గందరగోళంలోకి నెట్టాయి.

David Warner

ఈ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “డేవిడ్ వార్నర్ ఓ దొంగ ముం** కొడుకు. క్రికెట్ ఆడాల్సిన ఇతను.. బుజం పైకి లేపి రీల్స్ చేసి పుష్ప లా ఫీల్ అయ్యాడు’’ అంటూ జోక్ వేశారు. అలాగే, ‘‘వార్నర్.. ఇదే వార్నింగ్?’’ అంటూ సెటైరిక్ టోన్‌లో మరో కామెంట్ చేశారు. దీంతో కొందరు ఇది సరదా కామెంట్ అనుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం విభిన్న రియాక్షన్స్ వచ్చాయి. కొంతమంది అభిమానులు “ఈ వ్యాఖ్యలు అవసరమా?”, “విదేశీయుడికి ఇలా పిలవడం సబబా?” అని ప్రశ్నించారు.

ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula)  స్పందించారు. “రాజేంద్రప్రసాద్ గారు అలా సరదా కామెంట్ చేసి ఉండవచ్చు. కానీ వార్నర్ ఏమైనా ఫీల్ అయుంటాడేమోనని ముందుగానే నేను దగ్గర నుంచి క్లారిటీ ఇచ్చాను. తెలుగు భాషలోని కొన్ని మాటలు ఆయనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి, ఆయనకి స్పష్టంగా చెప్పాను – ఇది ఫన్ మాత్రమే..” అని వార్నర్ కు చెప్పినట్లు.. వెంకీ వివరణ ఇచ్చారు.

ఇక వార్నర్ చాలా కూల్ గా స్పందించారని వెంకీ తెలియజేశాడు. నేను క్రికెట్‌లో ఎన్నో స్లెడ్జింగ్‌లు చూశాను. ఇది సినిమాలో స్లెడ్జింగ్ అనుకుంటా.. యాక్టింగ్‌లో ఫన్‌గా అనిపించింది. ఆయన పెద్దవారు, సరదాగా మాట్లాడారు” రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్, ఆయన చెప్పినది సరదా కామెంటే” అని వార్నర్ అన్నట్లు వెంకీ చెప్పారు. ఈ కామెంట్స్‌తో వార్నర్‌కు ఎలాంటి హర్ట్ ఫీలింగ్ లేదని స్పష్టమైంది. అభిమానులు కూడా వార్బర్ గుడ్ పర్సన్ అంటూ కమెంట్ చేస్తున్నారు.

‘రాబిన్ హుడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus