మహేష్ సాంగ్ కి వార్నర్ షాడో బ్యాటింగ్!

టాలీవుడ్ హీరోల డైలాగ్స్ అండ్ సాంగ్స్ పై డేవిడ్ వార్నర్ అభిరుచి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆయన వరుసగా టాలీవుడ్ హీరోలైన బన్నీ, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలకు సంబందించిన సాంగ్ లేక డైలాగ్ వీడియోలు చేయడం జరిగింది. ఇక ఈయన భార్యతో కలిసి చేసిన బుట్టబొమ్మ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. తాజాగా మహేష్ సాంగ్ లోని ఫేమస్ లైన్ ‘ఆడ్ని కొట్టమని డప్పు.. నువ్వు కొట్టారా’ అనే బీట్ కు వార్నర్ తన షాడో బ్యాటింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

టిక్ టాక్ ఆప్ లోని టెక్నీక్ ని ఉపయోగిస్తూ సరిలేరు నీకెవ్వరు మూవీలో బీట్ సాంగ్ లోని ఫేమస్ డైలాగ్ కి ఆయన చేసిన వీడియో కొత్తగా ఉంది. వీడియో పోస్ట్ చేసిన వార్నర్ ‘ ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య మరియు పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం’ అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు హీరోల సాంగ్స్ కి, డైలాగ్స్ కి టిక్ టాక్ వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి అనుభూతిని ఇస్తుంది.

David Warner shocks Mahesh Babu Fans1

గతంలో మహేష్ పూరిల బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి లోని ఒక్కసారి కమిటైతే నామాట నేనే వినను అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఆ సంధర్భంలో పూరి, వార్నర్ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. తాజాగా వార్నర్ పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియో ఫ్యాన్స్ కి మంచి అనుభూతి పంచుతుంది. ఐ పి ఎల్ లో వార్నర్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉండగా, ఈసారి ఆయనకు టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ నుండి ఘన స్వాగతం అందడం ఖాయం.


Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus