Deepavali Review in Telugu: దీపావళి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పూ రాము (Hero)
  • NA (Heroine)
  • కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు (Cast)
  • రా వెంకట్ (Director)
  • స్రవంతి రవికిశోర్ (Producer)
  • థీసన్ (Music)
  • ఎం. జయప్రకాశ్ (Cinematography)
  • Release Date : నవంబర్ 11, 2023

దీపావళి సందర్భంగా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. డబ్బింగ్ సినిమాలు అలాగే కొన్ని చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘జపాన్’ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ఈ రెండూ డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ కాస్త క్రేజ్ ఉన్న సినిమాలుగా పేర్కొనాలి. అయితే ఆ రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అయితే రెండూ డిజప్పాయింట్ చేశాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..టాలీవుడ్ అగ్ర నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మొదటిసారి తమిళంలో ‘కిడ’ అనే చిత్రాన్ని నిర్మించారు. అదే చిత్రాన్ని తెలుగులో ‘దీపావళి’ పేరుతో రిలీజ్ చేశారు. కేవలం ‘స్రవంతి’ రవి కిషోర్ బ్రాండ్ పై వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ: టైటిల్ కి తగ్గట్టే ఇది దీపావళి పండుగ టైంలో జరిగే కథ. ఓ పల్లెటూరు. అక్కడ ఓ పేద రైతు శీనయ్య (పూ రామ్). తన కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవడు గణేష్(దీపన్ వైరుమండి) ని ప్రాణంగా పెంచుతాడు. అయితే గణేష్ ఒకరోజు దీపావళి పండుగ సందర్భంగా కొత్త బట్టలు వేసుకుని, టపాసులు కాల్చుకోవాలి అని ఆశపడతాడు. మనవడి కోరిక తీర్చాలని శీనయ్య కూడా తాపత్రయపడతాడు. కానీ అతని వద్ద డబ్బు ఉండదు.

తెలిసిన వాళ్ళని అప్పు అడుగుతాడు. కానీ ఎవ్వరూ ఇవ్వకపోగా ‘మీ పేద బ్రతుకులకి పండుగలు వంటివి ఎందుకు?’ అంటూ విమర్శిస్తారు. అయినా శీనయ్య తగ్గడు. తన వద్ద ఉన్న మేకని అమ్మేసి తన మనవడి కోరిక తీర్చాలి అనుకుంటాడు. కానీ అతని మనవడికి ఆ మేక అంటే ప్రాణం.దీపావళి పండుగకి నాకు కొత్త బట్టలు వంటివి వద్దు.. ఆ మేకని మాత్రం అమ్మొద్దు అని తన తాతని బ్రతిమిలాడతాడు. మరోపక్క మాంసం దుకాణంలో పనిచేసే వీరా స్వామి తాగుడుకి బానిస కావడం వల్ల పనికి లేట్ గా వెళ్తూ ఉండటంతో పని కోల్పోతాడు.

ఈ క్రమంలో సొంతంగా మటన్ కొట్టు పెట్టుకుని ఎదగాలని ప్రయత్నాలు మొదలు పెడతలడు. మరోపక్క అతని కొడుకు మేనత్త కూతురితో లేచిపోవాలి అని ప్రయత్నం చేస్తాడు. మరోపక్క నలుగురు దొంగలు శీనయ్య మేకని దొంగిలించాలి అనుకొంటారు. ఫైనల్ గా వీళ్ల కలయిక ఎలా జరిగింది. వీరి సమస్యలు ఎలా తీరాయి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న ఒక్క నటుడు కూడా కనిపించడు. అయినా ప్రతి ఒక్కరూ పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పాలి. ప్రతి ఒక్క పాత్రతో అందరూ బాగా కనెక్ట్ అవుతారు. తాతగా పూ రామ్, మనవడిగా దీపన్, వీరస్వామిగా కాళీ వెంకట్ .. లు హైలెట్ అని చెప్పాలి.మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో ఫీమేల్ ఆర్టిస్టులకి స్పేస్ తక్కువ. అయినప్పటికీ వారి పాత్రలతోనే ఒక చక్కని ముగింపు ఇచ్చారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాని కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఒక పండుగ అనేది పేద కుటుంబాలకు ఎంత భారంగా ఉంటుంది. పండుగ టైమ్ కి డబ్బులు సమకూర్చుకోవడానికి వారు ఎంత కష్ట పెడతారు అనేది ఈ సినిమా లైన్. దీనిని దీపావళి పండుగ నేపథ్యంలో చెప్పాలని దర్శకుడు అనుకున్నాడు. ఎక్కువమంది జనాలు దీపావళి పండుగ టైమ్ లో టపాసులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు.

కాబట్టి పాయింట్ మంచిదే. కానీ సినిమా లిబర్టీస్ తీసుకోకుండా తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఈ విషయంలోనే దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో ఎక్కువగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ బాగానే ఉంది. క్లైమాక్స్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయినా.. ఎండింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఓకే అని చెప్పాలి.

విశ్లేషణ: ఓవరాల్ గా ఈ ‘దీపావళి’ (Deepavali)  మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి పోటీలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus